మీ అభిమతం టిక్ చేయండి. మీ అభిప్రాయం తెలపండి.
అందగత్తెలు కొందరు అతి గుంభనంగా ఉంటారు వారు అందరిలా నేల మీద నడవరు మగాళ్ళ గుండెల మీద నుంచే నడుస్తుంటారు వారి మౌనం మంద్రంగా ఎగసే తుపాను వారి మాట మంచుకొండను తటాలున కరిగించే సెగలేని జ్వాల వారు చూపుతో గుండెలను చిచ్చుబుడ్లు చేసి వెలిగిస్తూ పోతారు అతి వెచ్చని వెలుతురు పూలను లోలోపలే ఎగజిమ్ముతూ ఎగజిమ్ముతూ చిచ్చుబుడ్లు ఓరోజున ఖాళీ అయిపోతాయి బూడిద చిప్పల్లా నోళ్ళు తెరచుకుని తనువు చాలిస్తాయి- మళ్ళీ కొత్త చిచ్చుబుడ్లు మొలకెత్తుతూనే [...]
.. ఈ మిలీనియంలో చివరి మెట్టు మీద నిలబడి మెలకువలోనే కలలు కనేవాడు తుది చరణాన్ని గురిపెడుతున్నాడు. తన singular solitude లోంచి పక్కకు జరిగి, తన నీడను తానే చూస్తూ, చూపిస్తూ విచిత్రానికి లోనవుతున్నాడు. పారదర్శకపు చీకటి పొరపై పుప్పొడిలా పేరుకున్న గుసగుస ఈ కవిత్వమంతా. అనుభవంలోచి తాదాత్మ్యతను వెదజల్లే నిగారింపు కవిత్వం. మనం చాలాసార్లు అనుకుంటూ వుంటాం, కవిత్వం అర్థం కావాలని, మన అర్థాల్లోనే అర్థం కావాలనీ పట్టుబడతాం. కానీ అంతా విరుద్ధంగా జరుగుతూ [...]
. . జ్ఞాపకాలు గాలిలోనే ఉంటాయి ఉన్నఫళంగా దేహాన్ని చుట్టుకుని లాక్కుపోతాయి కన్నీళ్ళు గాలిలోనే ఉంటాయి అదాటున గుండెలోకి చొరబడి దారులు వెతుక్కుంటాయి మాటలూ మౌనమూ శబ్దమూ నిశ్శబ్దమూ అన్నీ గాలిలోనే మనం ఉత్త తంబుర బుర్రలా తిరుగుతుంటాం గాలివాటుకు- . * బోర్లించిన పుస్తకం కిందే రెండు కళ్ళూ కలలకు కళ్ళూ, కారణాలూ అక్కర్లేదు కలలో మెలకువ కోసం ఆరాటం మెలకువలో మళ్ళీ కలల కోసం…. కోటానుకోట్ల అక్షరాలన్నీ ఏమవుతున్నాయి? కళ్ళ మీద పడి ఏడుస్తున్నాయి [...]