.
ముళ్ళపూడి వెంకటరమణకు ఎనభయ్యేళ్ళేమిటి? ఆయన నవయౌవనుడు అంటారు ఆత్మీయులు. కానీ, ఆత్మకు దేహంతో రుణం తీరిపోయే ఘడియ రాకమానదు. ఆ క్షణం వస్తేనేం? ముళ్ళపూడి మన మధ్యే ఉంటాడు నిత్వయౌవనుడిగా. ఇక, ఆయనను రెండోసారి మన నుంచి దూరం చేసే శక్తి ఏ శక్తికీ లేదు. బాపూరమణల ద్వంద్వ సమాసానికి వచ్చిన ఇబ్బంది అంతకన్నా లేదు. బాపూరమణీయం
కాలాన్ని జయించి చాలా కాలమే అయింది. ముళ్ళపూడి సాహిత్యంలో సంప్రదాయ వాసనలు.. తెలుగుదనం వంటి పడిగట్టు పదాల సంగతి ఎలా ఉన్నా.. ఆయన మధ్య తరగతి జీవితంలోంచి పాత్రలను చిత్రించిన తీరు అద్భుతం. ఆయన కథానాయకుడు నేల విడిచి సాముగరిడీలు ఎన్నడూ చేయలేదు. సినిమాల్లో కూడా. ఆరోగ్యకరమైన హాస్యం, ఇంకా చెప్పాలంటే మర్యాదపూర్వకమైన హాస్యం.. ఆ నవ్వుల మాటున ఆర్ద్రంగా స్పృశించే కరుణ రసం ముళ్ళపూడి వెంకటరమణ సాహిత్యాన్ని చిరస్మరణీయం చేసింది. మనసుకు తగిన గాయాలను కూడా అందమైన అధిక్షేపణగా బంధించే విద్య తెలిసిన ముళ్లపూడి.. బాధను చమత్కారంగా మార్చడం కొత్తగా కోతికొమ్మచ్చి చదివినవారికి కూడా బాగా తెలుసు. బాపు, రమణలు పక్కపక్కనే కూర్చుంటే.. వారితో మాట్లాడ్డం ఒక మరిచిపోలేని అనుభవం. సంభాషణలోనూ అల్లరితనం.. క్షణక్షణం వినిపిస్తుంది. జర్నలిస్టులు బాపు గారి బైట్ కోరితే.. రమణ గారివ్వడం చాలా మామూలు. రమణ గారి మాటనే నా మాటగా తీసుకోండి అని ఆయన తరచూ చెప్పేవారు. ఓసారి బాపు గారి వద్దకు వెళ్ళి రమణగారు ఎక్కడున్నారని అడిగితే, “ఇన్నాళ్ళూ నా పక్కనే తోడుగా ఉన్నారు. ఇప్పుడు ఆయనను నా తలపై పెట్టుకున్నాను” అని మేడపైన గది చూపించారు నవ్వుతూ. అమ్మ లాంటి రమణ అని చెప్పుకున్న బాపు నిజంగానే ఆయనను తలపైన పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఇరు దేహాలలోని సగం ఆత్మ ఎక్కడికని వెళ్తుంది? మిగిలిన సగంలోనే కదా కలుస్తుంది. అందుకే, బాపులో రమణ కనిపిస్తాడు. బాపు రేఖల్లో, చిత్రాల్లో వినిపిస్తూనే ఉంటాడు. పాత్రికేయునిగా, కథకునిగా, స్క్రైబ్ గా, సినీ సంభాషణల రచయితగా, నిర్మాతగా బహుముఖంగా రాణించిన ముళ్ళపూడి వెంకటరమణ.. మూగమనసు బాసలు తెలిపేందుకు మళ్ళీ తప్పకుండా వస్తారు.
కాలాన్ని జయించి చాలా కాలమే అయింది. ముళ్ళపూడి సాహిత్యంలో సంప్రదాయ వాసనలు.. తెలుగుదనం వంటి పడిగట్టు పదాల సంగతి ఎలా ఉన్నా.. ఆయన మధ్య తరగతి జీవితంలోంచి పాత్రలను చిత్రించిన తీరు అద్భుతం. ఆయన కథానాయకుడు నేల విడిచి సాముగరిడీలు ఎన్నడూ చేయలేదు. సినిమాల్లో కూడా. ఆరోగ్యకరమైన హాస్యం, ఇంకా చెప్పాలంటే మర్యాదపూర్వకమైన హాస్యం.. ఆ నవ్వుల మాటున ఆర్ద్రంగా స్పృశించే కరుణ రసం ముళ్ళపూడి వెంకటరమణ సాహిత్యాన్ని చిరస్మరణీయం చేసింది. మనసుకు తగిన గాయాలను కూడా అందమైన అధిక్షేపణగా బంధించే విద్య తెలిసిన ముళ్లపూడి.. బాధను చమత్కారంగా మార్చడం కొత్తగా కోతికొమ్మచ్చి చదివినవారికి కూడా బాగా తెలుసు. బాపు, రమణలు పక్కపక్కనే కూర్చుంటే.. వారితో మాట్లాడ్డం ఒక మరిచిపోలేని అనుభవం. సంభాషణలోనూ అల్లరితనం.. క్షణక్షణం వినిపిస్తుంది. జర్నలిస్టులు బాపు గారి బైట్ కోరితే.. రమణ గారివ్వడం చాలా మామూలు. రమణ గారి మాటనే నా మాటగా తీసుకోండి అని ఆయన తరచూ చెప్పేవారు. ఓసారి బాపు గారి వద్దకు వెళ్ళి రమణగారు ఎక్కడున్నారని అడిగితే, “ఇన్నాళ్ళూ నా పక్కనే తోడుగా ఉన్నారు. ఇప్పుడు ఆయనను నా తలపై పెట్టుకున్నాను” అని మేడపైన గది చూపించారు నవ్వుతూ. అమ్మ లాంటి రమణ అని చెప్పుకున్న బాపు నిజంగానే ఆయనను తలపైన పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఇరు దేహాలలోని సగం ఆత్మ ఎక్కడికని వెళ్తుంది? మిగిలిన సగంలోనే కదా కలుస్తుంది. అందుకే, బాపులో రమణ కనిపిస్తాడు. బాపు రేఖల్లో, చిత్రాల్లో వినిపిస్తూనే ఉంటాడు. పాత్రికేయునిగా, కథకునిగా, స్క్రైబ్ గా, సినీ సంభాషణల రచయితగా, నిర్మాతగా బహుముఖంగా రాణించిన ముళ్ళపూడి వెంకటరమణ.. మూగమనసు బాసలు తెలిపేందుకు మళ్ళీ తప్పకుండా వస్తారు..
ఒకే వారంలో మిక్కిలినేని రాధాకృష్ణమూర్తిని, ముళ్ళపూడి వెంకట రమణ వంటి ఉద్ధండులను కోల్పోవడం తెలుగు జాతికి తీరని లోటే. నాటక రంగానికి మిక్కిలినేని చేసిన సేవ చిరస్మరణీయం. సామాజిక, కళా చైతన్యంతో ఎదిగిన మిక్కిలినేని భీముడంటే భీముడే.. యమధర్మరాజు అంటే యమ ధర్మరాజే. స్వతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్న ఈ రాజకీయ చైతన్యశీలి.. తన 95 ఏళ్ళ జీవితంలో 80 ఏళ్ళు కళామతల్లి సేవలోనే గడిపారు. లభించిన పేరు ప్రతిష్ఠలకన్నా ఉన్నతమైన జీవితాన్ని గడిపిన మిక్కిలినేని గురించి అత్తలూరి విజయలక్ష్మి గారు ఆంధ్రభూమిలో చక్కని వ్యాసం రాశారు: http://www.andhrabhoomi.net/kalabhoomi/mikkilineni-37 . ఆయన స్మృతికి నీరాజనం..
***
Advertisement
andariki nivaalulu.