తెలంగాణ ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగానే ఉందని కేసీఆర్ కు ఎవరు చెప్పారు?

ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సందర్భంలో, తెలంగాణ ప్రజలకు హామీ లభించాల్సింది కేంద్రం నుంచి మాత్రమే. ఉద్యమ సారథులు లేదా ఉద్యమ పార్టీ నేతలు ఇచ్చే అలాంటి హామీలకు విలువ లేదు. గతంలో ఎన్నోసార్లు తెలంగాణ ప్రాంత నాయకులు ఢిల్లీ పెద్దల మనసు తమకు తెలిసిపోయినట్లు మీడియా మైకుల ముందు మాట్లాడారు. ఢిల్లీకి వెళ్ళి సోనియా, అహ్మద్ పటేల్, ఆజాద్ తదితరులతో చర్చలు జరిపి బయటకు వచ్చాక, కేంద్రం తెలంగాణ డిమాండ్ పట్ల సానుకూలంగా ఉందని వారు నమ్మబలికే ప్రయత్నాలు చేశారు. కానీ, ఢిల్లీ పెద్దల్లో ఏ ఒక్కరు కూడా తెలంగాణ నేతలతో మాట్లాడిన తరువాత తమ వైఖరిని స్వయంగా ప్రకటించిన సందర్భం ఒక్కటి కూడా లేదు. సకల జనుల సమ్మెతో ప్రజలంతా కష్టాలకోర్చి ఉద్యమాన్ని మలిదశకు నడిపిస్తున్న సందర్భంలో నాయకత్వం ఎంతో అప్రమత్తంగా ఉండాలి.

“ డెఫినెట్ గా తెలంగాణ వస్తది. కేంద్రం తెలంగాణ ఇవ్వడానికే సిద్ధమైంది. తెలంగాణపై త్వరలో నిర్ణయం. కర్నూలు, అనంతపురం జిల్లాలతో కలిపి తెలంగాణను ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం యోచిస్తోంది” అంటూ టీఆరెస్ అధినేత కేసీఆర్ ఈరోజు చేసిన వ్యాఖ్యల వల్ల ఉపయోగం ఏమిటి? ఆయన నిజం చెబుతున్నారా? జోస్యం చెబుతున్నారా? నిజమైతే అంతకన్నా కావాల్సింది మరొకటి లేదు. కానీ, ఆయన చెబుతున్నది జోస్యమైతే దానివల్ల ఉద్యమానికి నష్టమే తప్ప లాభం లేదు. ఉన్నత నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు అలా మాట్లాడడం వల్ల ఉద్యమం మీద నీళ్ళు చల్లినట్లవుతుంది. అది నమ్మకాన్ని వ్యక్తం చేయడం కిందకే రావచ్చు. అయనా సరే, అలాంటి ప్రకటనల వల్ల పరుగు తీస్తున్న వాడి చూపు పక్కకు తిరిగే ప్రమాదం ఉంది.

రెండు నెలల కిందట అంటే సరిగ్గా జూలై 14న తెలంగాణ కాంగ్రెస్ నేతల 48 గంటల ధర్నాకు సంఘీభావం తెలుపుతూ,  అదే వేదిక మీద ఇదే కేసీఆర్ కాంగ్రెస్ కండువా కప్పుకుని, “మరో రెండు వారాల్లో తెలంగాణ ప్రకటన వెలువడుతుంది” అని ప్రకటించారు. అలా అని ఢిల్లీ నుంచి తనకు సమాచారం వచ్చిందని కూడా చెప్పారు. రెండు నెలలు గడిచిపోయాయి. ఏమీ జరగలేదు. ప్రజలే వందలు, వేలు, లక్షలై సమ్మె బాట పట్టాల్సి వచ్చింది. లక్ష్యాన్ని స్వప్నిస్తూ, కష్టాలను సహిస్తూ సకల జనుల సమ్మెతో చరిత్రను కొత్త నిర్వచిస్తూ ఉద్యమిస్తున్నారు.
ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ కేంద్రం తెలంగాణ ఇవ్వడానికే సిద్ధమైనట్లు తన వద్ద సమాచారం ఉందంటున్నారు. అది నిజమే అయితే పెరుగుతున్న పోలీసుల అరాచకాలకు అర్థం ఏమిటి? ఈ (28 సెప్టెంబర్) ఉదయం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి ఏం మాట్లాడి ఉంటారు? ఏది ఏమైనా, తెలంగాణపై నిర్ణయం ప్రకటించాల్సింది కేంద్రమే. తెలంగాణ ఇవ్వడానికి కేంద్రం సిద్ధమైందో లేదో అన్నది కేంద్రమే చెప్పాలి. మనకు జోస్యాలతో పని లేదు. తెలంగాణ ప్రజ ఇప్పుడు అమాయకంగా అద్దంలో చందమామ కోసం పోరాడడం లేదు. దశాబ్దాల కలను నిజం చేసే అధికారిక ప్రకటన కోసం శాంతియుతంగా పోరాడుతోంది. అందుకోసం, ఉద్యమ నాయకత్వం “ప్రజలతో మాట్లాడడం” కాకుండా, “ప్రజల వైపు నుంచి మాట్లాడడమే” కొనసాగించాలి. అంతవరకూ, కేసీఆరే అన్నట్లు, “ఏం చేసినా తెలంగాణ ఆగదు. ఇప్పుడు తెలంగాణ రాకపోతే పాతాళానికి తొక్కుతరు.”

***

Advertisement

5 Comments »

  1. 1
    మూర్తి Says:

    ఆయన వద్ద అలాంటి సమాచారమేదీ ఉండదు! తెలంగాణా ప్రజలను నమ్మించడానికి చెప్పే కంటి తుడుపు మాటలే అవి! సమాచారం ఆయన వద్ద ఉండటమేం? జేబులో పర్సు లాగా? దాన్ని ఆధారాలతో,అధికారికంగా బహిర్గతం చెయ్యరాదూ?

    “ఏం చేసినా తెలంగాణ ఆగదు. ఇప్పుడు తెలంగాణ రాకపోతే పాతాళానికి తొక్కుతరు.”________ఇది మాత్రం నిజమే! ప్రజలు ఆ మూడ్ లోనే ఉన్నారు! ఎవర్ని తొక్కుతారో కూడా చంద్ర శేఖర్ రావుకి బాగానే తెలుసు

  2. 2
    Ramu Says:

    Good post, Mr.Sridhar. KCR and Gaddar look like spoilsports.
    Ramu
    apmediakaburlu.blogspot.com

  3. 3
    Hari Dornala Says:

    1969లో ఉవ్వెత్తున ఎగసిపడ్డ తెలంగాణావాదం కౄరమైన అణచివేతకు లోనై నిస్పృహగా మారింది. 2001లో కేసీయార్ తిరిగి ఉత్తేజ పరిచే వరకూ అది ప్రజల మనస్సుల్లో నిద్రాణంగానే వుంది.

    అయితే తాను తీసుకున్న నిర్ణయాలు ఫలించినా బెడిసి కొట్టినా, కేసీయార్ ప్రజల్లో తెలంగాణా పై ఆశలు సజీవంగా వుంచడంలో మాత్రం విజయం సాధించాడు. లక్ష్యం అతి కొద్ది దూరం లోనే వుందని చెప్పడం ద్వారా ప్రజలు నిస్పృహలోకి వెళ్ళకుండా మాత్రం జగ్రత్త వహిస్తున్నాడు.

    కేసీయార్ తాజా వ్యాఖ్యలు కూడా ఈ కోవలోకే వస్తాయని అనిపిస్తుంది. ఇదివరలో ప్రైవేటు సమావేశంలో ఇదే కేసీయారు 2014 వరకు తెలంగాణా వచ్చే అవకాశం లేదని చెప్పినట్టు వార్తలు వచ్చాయి.

  4. 4
    narsim Says:

    ఇప్పటి ఈ తెలంగాణ ఉద్యమానికున్న ప్రత్యేకత ఏమిటంటే ప్రజలే నాయకత్వ పాత్ర పోషించడం. ఇక కెసిఆర్ ఆ ప్రజల్లో ఒక్కడుగానే చూడబడుతున్నాడు. ‘నాకు ప్రత్యేక సమాచారం ఉంది’ అంటే ఆ మిగతా ప్రజ నమ్మే స్థితిలో లేరు, చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు. గాల్లో “ఛూ మంత్రం” అంటే నడవది. ‘నిజంగా చూపించు బిడ్డా’ అని నిలదీస్తుండ్రు. అందుకని మీరు చెప్పింది నిజం- ‘నా ప్రజలతో మాట్లాడతా’ అన్నభ్రమ నుంచి కెసిఆర్ బయటపడి ‘నా ప్రజలవైపు నుంచి మాట్లాడుతున్నా’నన్నది ఆయన నేర్చుకోవాలి. అప్పుడిక ఈ ఛూమంత్రఖాళీ డైలాగులు రావు. కెసియార్ కూడా ప్రాక్టికల్ గా మారతాడని ఆశిద్దాం. -నర్సిం

  5. 5
    ramphani Says:

    Good comment Sree! People have already tasted the hollowness of the Politicians. No more!


RSS Feed for this entry

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 487 other followers