దేఖొ దేఖో గబ్బర్ సింగ్.. ఆల్ ఇండియాకు హైపర్ సింగ్.. టైటిల్ సాంగ్ దుమ్ము రేపింది. పిల్లా నువ్వు లేని జీవితం నూనె లోంచి వానలోకి జారిపడ్డ అప్పడం… పాట రిఫ్రెషింగ్ విజువల్స్ లోకి డోర్ తెరిచినట్లు స్వాగతం పలికింది. కెవ్వు కేక.. పాట స్పీకర్లలోనే గోల పెట్టింది. తెర మీద బొమ్మకూ సాంగుకూ ఎక్సయిటింగ్ లింకూ లేదు.. సింకూ లేదు. ఫిర్ భీ తమాషా చాలూ రహా! ఫక్తు మాస్ మాసాలా ఫార్ములాయే… విలన్ కు [...]
పార్లమెంటు తొలిసారి సమావేశమై 60 ఏళ్ళు అయిన సందర్భంగా ఏర్పాటైన ఉభయసభల ప్రత్యేక సమావేశంలో చట్టసభల ప్రతినిధులు ఉదాత్తమైన తీర్మానాలు చేశారు. పార్లమెంటు గౌరవాన్ని ఔన్నత్యాన్ని పవిత్రతను కాపాడతాం. ప్రజాస్వామ్య విలువలను పటిష్ట పరచి, మార్పునకు పార్లమెంటును తిరుగులేని వేదికగా తీర్చిదిద్దుతాం. పార్లమెంటు ద్వారా ప్రజా ప్రతినిధుల జవాబుదారీతనాన్ని పెంపొందిస్తాం. మరీ ముఖ్యంగా.. జాతి నిర్మాణమనే పరమ పవిత్ర లక్ష్యాన్ని సాధించేందుకు పునరంకితమవుతాం. వినడానికి ఎంతో ఓదార్పుగా ఉన్నాయి ఈ తీర్మానాలు. గాయపడ్డ వారికి కావల్సింది ఓదార్పే. [...]
రామ్ గోపాల్ వర్మ అంటే కొందరికిష్టం. కొందరికి కష్టం. మరికొందరికి అయిష్టం. ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా.. ఆయనను పట్టించుకోకుండా ఉండలేం. You may not like him, but you cannot ignore him… అనే వాక్యం వర్మకు బాగా సరిపోతుంది. లేటెస్ట్ గా ఆయన డిపార్ట్ మెంట్ అనే సినిమా తీశారు. ముందుగా మేకింగా ఆఫ్ డిపార్ట్ మెంట్ ఇంటర్నెట్లో రిలీజ్ చేశారు. ఈ మేకింగ్ విజువల్స్ చూస్తే ఆయన కెమేరాతో కాదు.. సినిమా మీడియాతోనే ఓ [...]
చీకటిని ఈదుకుంటూ ఇంటికి పోతుంటే పొద్దుటి చేపపిల్లలు నక్షత్రాల గుంపులుగా చుట్టుముడుతున్నాయ్ వెనుక జేబులో దాచిపెట్టుకున్న పొద్దుటి సూర్యుడు… లాలిపాప్స్ లా తొంగిచూస్తున్నాడు- బుగ్గల మీద అద్దుకున్న వీడ్కోలు ముద్దులు చెలమల్లోంచి సీతాకోకచిలుకల్లా రెక్కవిప్పుతూ రాత్రిని వెలిగిస్తుంటే.. రోడ్డు వెంబడి స్ట్రీట్ లైట్స్ తలవంచుకుని చూస్తున్నయ్- ఒక జేబులో పర్సు, ఒక జేబులో కర్చీఫు, ఇంకో జేబులో దువ్వెన… సంచీలో కాగితాలు.. కాగితాల్లో అక్షరాలు… వీటన్నింటితో పాటు నాలోపలి గోడలకు అతికించిన చూపులు ఆ చూపులకు వేలాడే [...]
(చెన్నైలోని తెలుగు జర్నలిస్టుల సంఘం TEJOUS దశాబ్ది సంచికలో ప్రచురితమైన వ్యాసం. ఆ సంచికలో కొన్ని పేరాలు ముందు, వెనక అచ్చవడంతో కొంత గందరగోళం ఏర్పడింది. ఇక్కడ.. ఆ వ్యాసం అసలు ప్రతిని పోస్టు చేస్తున్నాను. జర్నలిస్టులు, మిత్రులు, జర్నలిస్టు మిత్రులు, బ్లాగ్హితులు ఈ వ్యాసంపై విలువైన అభిప్రాయాలు తెలుపుతారని ఆశిస్తాను.) “You can trust in us for correcting our mistakes” ‘నిజమే చెబుతాం. అబద్ధం అస్సలు చెప్పం. మమ్మల్నే నమ్మండి’ వంటి ప్రకటనల [...]
టీవీ చానళ్లు ముఖ్యంగా తెలుగు వార్తా చానళ్ళ మీద కొలవెరి బాణీలో యూట్యూబ్ లో ప్రత్యక్షమైన పాట:
It is so sad that national channel like CNN-IBN conducts a debate on Telangana with focus on Brand Hyderabad and the anchor Sagarika tried to blame the politicians fromTelagana for not trying to keep the temperatures down in the region. I wonder,how she can ignore the fact that the people of the region fighting for [...]
ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సందర్భంలో, తెలంగాణ ప్రజలకు హామీ లభించాల్సింది కేంద్రం నుంచి మాత్రమే. ఉద్యమ సారథులు లేదా ఉద్యమ పార్టీ నేతలు ఇచ్చే అలాంటి హామీలకు విలువ లేదు. గతంలో ఎన్నోసార్లు తెలంగాణ ప్రాంత నాయకులు ఢిల్లీ పెద్దల మనసు తమకు తెలిసిపోయినట్లు మీడియా మైకుల ముందు మాట్లాడారు. ఢిల్లీకి వెళ్ళి సోనియా, అహ్మద్ పటేల్, ఆజాద్ తదితరులతో చర్చలు జరిపి బయటకు వచ్చాక, కేంద్రం తెలంగాణ డిమాండ్ పట్ల సానుకూలంగా ఉందని వారు నమ్మబలికే [...]
. గతం గతిస్తుందా? చిన్నప్పటి అమ్మ చేతి గోరు ముద్దల రుచి లీలగా మదిలో మెదులుతూనే ఉన్నప్పుడు, బండ రాతి కొండలపైకి ఎక్కి మగ్గిన సీతాఫలాలను తెంపుకుని మిత్రులతో కలిసి పంచుకున్న జ్ఞాపకం మూసిన రెప్పల తెరపై స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, సిటీ బస్సుల ఫుట్ బోర్డుల మీద వేలాడుతూ కాలేజీకి వెళ్ళినప్పుడు భుజాలు లాగిన తీపి బాధ ఇంకా అక్కడే సద్దుమణగకుండా గొణుగుతున్నప్పుడు, స్నేహితుల భుజాల మీద చేతులు వేసినప్పుడు రుచి తెలిసిన అభిమాన స్పర్శ ఇంకా అరిచేతుల్లో వెచ్చగా [...]
. మా ఇంట్లో ఈ మధ్యే అంతరిక్షాన్ని ఆవిష్కరించాం అక్షరమక్షరం తడిమి తడిమి తెలుసుకుంటున్నాం మా చూపుడు వేళ్ళ మీద నక్షత్రాలు వెలుగుతున్నాయి మా కను రెప్పల వెంట్రుకలకు నెలవంకలు వేలాడుతున్నాయి నేనూ మా ఆవిడా కలసి కొత్త ఖగోళాన్ని పోటీ పడి ఒళ్ళోకి తీసుకుంటున్నాం మేమంతా ఉపగ్రహాలమై కొత్త చందమామ చుట్టూ పరిభ్రమిస్తున్నాం ప్రతి క్షణం ఉదయిస్తున్నాం… చీకటిని వెలిగిస్తున్నాం… కొత్త రుతువులమై పరిమళిస్తున్నాం.. . ………………….. …………………………….