Category Archives: అనేకవచనం

పసునూరు శ్రీధర్ బాబు కవిత్వం

ప్రేలాపన

… ఏ గొల్లభామో దొంగిలించిన వెన్నముద్ద కోసం మతిలేని గోపయ్య పిల్లనగ్రోవిలో కన్నీళ్ళు వొలకబోసుకుంటాడు రాధమ్మ వెనీలా ముద్దల్ని చెక్క చెంచాతో చప్పరిస్తూ ఉంటుంది- శంఖం పూరించిన గోవర్థనుడు పెదాల ఒత్తిడిలోంచి మెడవంపుల వీచిన గాలి …. నాదమో? అనునాదమో!? . … ఇప్పుడు సత్యభామ కాలిబొటన వేలి గోరు చిట్లే ఉంటుంది మంచం కోడుకు తగులుకుని! రుక్మిణి చిటికెన వేలు ఒంటరై కంపిస్తూ ఉంటుంది పదహారువేల జతల చురకత్తులు గుచ్చుకుని జల్లెడైన నీలాకాశం కుండపోతగా వర్షిస్తుంది- [...]

వెంటాడే కాళ్ళు

. మాటలన్నీ కుప్పబోసినట్లు వెంటాడే ఒక నిశ్శబ్దరావం భుక్తాయాసంతో తలచుట్టూ తిరిగే తుమ్మెద నిస్వన పంజరంలో ఇరుక్కున సరస్సు గాలుల్ని మోయలేక… ఎటూ కదలలేక… .. . . పండుటాకులు ఒక్కొక్కటిగా రాలిపడుతుంటాయి ఈదుతూ పోయే రాయంచపాదాలు కళ్ళల్లో కుశల ప్రశ్నలు చిలకరిస్తూ . రాలిన రేకులన్నీ ఒక్కటిగా గాల్లోకెగసినప్పుడు గులాబీయానంలో హేమంతం వెళ్ళిపోతుంది ఆవిరై ఘనీభవించి ఆకాశానికీ భూమికీ నడుమ పొరలు పొరలుగా కొత్త కొత్త ఆకారాలుగా ఆత్మసృజన- . *** మేడ మీద కుర్చీ [...]

డజన్ హైకూలు

తల్లి ఒడిలో ముద్దొచ్చే కవలపిల్లలు ఒకరికొకరు అద్దం . *** గట్టు మీద కుర్రాడు ఈత నేర్పుతా రారమ్మని సైగ చేస్తో సరస్సు . *** కోనేట్లో దూకితే జాబిల్లి కావలించుకుంది . *** వంతెన మీద ఆడపిల్ల వాగులో కొట్టుకుపోతూ . *** తెలతెలవారిపోతోంది చందమామ చిన్నబుచ్చుకుంది . *** ఆరుబయట కోయిల కూత నేనేమో స్నానాల గదిలో . *** చిలక కొరికిన జాంపండు నాతో తీయగా మాట్లాడింది . *** పూల సజ్జతో [...]

తప్త స్వప్నమ్!

. స్వప్న సరోవరంలో ఎవరదీ? పట్టుకుచ్చుల వింజామరల్ని భుజానేసుకుని నీళ్ళూపడానికి వస్తున్న మీనమా… ఎవరికోసమనీ… ఎవరి కోసమనీ…? నా చేతివేళ్ళకు దొరకని నేను నిద్రిత గగనంలో విద్యుత్పుంజమాల- వాగులై వంకలై వరదలై ఎచటికనీ? చీకట్లోంచి ఎగురుతూ వచ్చి వీధి దీపావర్తనంలో పగడం పారేసుకున్న మిణుగురు పురుగు మల్లే వెలుగుధూపమై వెళుతున్నది నేనా!? ఒకానొక పలిత గ్రహం వాలుమీద జారుడుబండాట ఆడుకోవల్సిందే… ముందే తెల్సినా నిచ్చెనలుండవని! . బాన కడుపుతో తిమింగలం ఆబగా అత్యాశగా మొత్తం సరోవరాన్నే దాహానికి [...]

దుస్సహం

. తెల్లారగానే సూర్యుడు అలల మీంచి దొర్లుకుంటూ వచ్చి ఒళ్ళో వాలతాడు కౌగిలించుకో ఆ వెలుగు ముద్దను ముద్దు పెట్టుకో హనుమంతుని మూతల్లే కాలితే కాలుతుంది పారదర్శక దేహంతో ప్రపంచంలోని ప్రతి ఆకారంలోంచీ చొచ్చుకుపో…. తరువాత భళ్ళున పగిలిపో గాజు బొమ్మలా ఆ సీసం పెంకుల్లో కవిత్వపు చెమ్మ… కలిపి కుడితే ఒక ప్రవాహం కవిత్వం భీకర ప్రవాహంలా గిరుల మీంచి దూకనక్కర్లేదు నాలుగైదు చినుకులుగా మోహపు పెదాలను తడుపుకుంటూ పోనూ వచ్చు ఈ కంప్యూటర్ యుగంలో [...]

అనిర్వచనం

. (అనేకవచనం కవితా సంపుటికి స్వీయవచనం) . కవిత్వం నాకొక spiritual activity. ఏమవుతుందో తెలియదు. ఉన్నట్టుండి నన్ను నేను కోల్పోతాను. నన్ను నేను పొందుతుంటాను. ముందు నుంచి వెనక్కీ, వెనక నుంచి ముందుకీ జీవిస్తుంటాను. Time is a myth కదా! మేల్కొంటాను అనేకానేక నేనులుగా. దేహాన్నొక processor గా వదిలేసి, దాని చేతుల్లో పెన్నూ పేపరూ పెట్టి మేమంతా చుట్టూ చేరి ఖేదాన్నో మోదాన్నో celebrate చేసుకుంటాం. చీకటి చిక్కనై చిక్కనై చివరకు కాటుకై అంటుకునే వేళ, కాగితంపై తెల్లదనం [...]

అనేకవచనం

నేను నీలోంచీ నీవు నాలోంచీ మనిద్దరమూ మరెవడిలోంచో సామూహిక ఆత్మల సహస్ర విచ్ఛేదనల్లోంచి! రెప్పలు తెరచిన చూపే స్వాధీనం రెప్పలు మూశాక అంతా అనాధీనం ఒకడు పడుకుంటాడు ఒకడు లేచి గోడకు వీపునానించి కూచుంటాడు ఒకతె వచ్చి నిమురుతుంది చీలిన చెంద్రబింబం లాంటి అరచేత్తో ముఖంలో రూపాలు మారుతుంటాయి అంచెలంచెలుగా… దృక్కులుగా చీలిన దేహంలో చీరిన గాయమైనా గానమైనా నన్నే స్పృహిస్తుంది- నాలో ఎవరు ఆమెకు దాసోహమయ్యారో తేల్చుకోవాలి ఆమెలో ఎవరు నాలో ఎవడ్ని ధ్వంసం చేయాలనుకుందో, [...]

నక్షత్రపురం దోవ

. ఏక్ చాయ్ ఏక్ ఎమ్టీ ఛాయల్లోకి వచ్చి పడ్డాను… మళ్ళీ ఈ ఇరుకిరుకు సిమ్మెంటు కచ్చడాల్లోకీ భద్రత లేని బంధింపనిచ్ఛగించలేని ఉద్యోగంలోకి ధూళీ శ్వాసల్తో వచ్చి పడ్డాను. అటు వస్తూన్నప్పుడు మా రాత్రి రైలు వెంట జూకాలుగా సంకేత సంగీతాల్ని వినిపించిన మిణుగురు పూలూ…  ’గిరితి’  ఇటు వస్తూన్నప్పుడు ఒత్తిగిల్లే నను మోయలేక సుతారంగా అణగిపోయిన పరక పాన్పులూ… ఈ రెంటి మధ్యా నన్ను ఇదమిత్థంగా వంచించని విరామ సంగీతమూ… మిత్రుడా ఈ ఒక్క పాటకే ఎన్ని సార్లని చేయనూ స్వరకల్పన? [...]

పూర్వ వచనం -ఇస్మాయిల్

(అనేకవచనం కవితా సంపుటికి ప్రసిద్ధ కవి రుషి ఇస్మాయిల్ రాసిన ముందుమాట) ‘అనిర్వచనీయమైన విషయాల గురించి మౌనం వహించమన్నా’డు తాత్వికుడూ, అంతకు మించిన తార్కికుడూ అయిన విట్ గెన్ స్టైన్ (Ludwig Wittgenstein). అనిర్వచనీయమైన వాటి గురించి మౌనం పాటిస్తే ఇక కవిత్వమే లేదు. విట్ గెన్ స్టైన్ సూక్తి శాస్త్రానికి (Science), తర్కానికీ వర్తిస్తుందేమో కాని, సాహిత్యానికి కాదు. అనిర్వచనీయమైన వాటిని నిర్వచించడమే కవిత్వం పని.. అనిర్వచనీయాల్ని నిర్వచించటానికి కవికి ఉపయోగపడే ముఖ్య సాధనం భాష. [...]

పూర్వ వచనం – ఇస్మాయిల్

(అనేకవచనం కవితా సంపుటికి ప్రసిద్ధ కవి రుషి ఇస్మాయిల్ రాసిన ముందుమాట) ‘అనిర్వచనీయమైన విషయాల గురించి మౌనం వహించమన్నా’డు తాత్వికుడూ, అంతకు మించిన తార్కికుడూ అయిన విట్ గెన్ స్టైన్ (Ludwig Wittgenstein). అనిర్వచనీయమైన వాటి గురించి మౌనం పాటిస్తే ఇక కవిత్వమే లేదు. విట్ గెన్ స్టైన్ సూక్తి శాస్త్రానికి (Science), తర్కానికీ వర్తిస్తుందేమో కాని, సాహిత్యానికి కాదు. అనిర్వచనీయమైన వాటిని నిర్వచించడమే కవిత్వం పని.. అనిర్వచనీయాల్ని నిర్వచించటానికి కవికి ఉపయోగపడే ముఖ్య సాధనం భాష. ఐతే, ఈ [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 754 other followers