హైకూల వర్షం

హైకూల వర్షం
వర్షాలకీ
జ్ఞాపకాలకీ
ఏదో గొప్ప సంబంధమే ఉంది
***
అటుపక్క వర్షం
ఇటుపక్క కవి
మధ్యలో కిటికీ
***
వాన వెలిసింది
కొమ్మల మీద పక్షులు
ఆకాశంలో నక్షత్రాలు వాలాయి
***
రాత్రి వర్షం
తడవని చీకటి
నల్లబడని వాన
***
ఫ్లాట్ ఫారమ్ మీదకు
రైలుకు బదులు
వర్షం వచ్చింది
***
పొద్దున్నే వాన
సూర్యుడి గురించి
ఎవరూ బెంగపడలేదు
***
చాచిన అరిచేతుల్లో
వర్షపు చినుకులు
చెంగు చెంగున ఎగురుతున్నాయి
***
వర్షధారల నడుమ
గాలి
వంకర్లు తిరుగుతోంది
***
గాలివాన
చెట్లన్నీ పాత ఆకులు
దులిపేసుకుంటున్నాయి
***
వాన కురుస్తోంది
వయసు
వెనక్కి నడుస్తోంది
***
వర్షం వచ్చింది, వెళ్ళింది
ఆరిపోవాలంటే
సమయం పడుతుంది
***
వర్షం
ఆకాశం నుంచి సముద్రానికి
సముద్రం నుంచి ఆకాశానికి
***
వర్షం మొదలైంది
పశువులూ పక్షులూ
చప్పుడు చేయకుండా కూర్చున్నాయి
***
జల్లు కురుస్తోంది
అంత పెద్ద సముద్రానికి
ఒళ్ళంతా చక్కిలిగింతలు
*** ***
_2F_images_2F_origs_2F_565_2F_june_15_spring_rains_original_acrylic_painting_w_texture_1
.
వర్షాలకీ
జ్ఞాపకాలకీ
ఏదో గొప్ప సంబంధమే ఉంది
***
అటుపక్క వర్షం
ఇటుపక్క కవి
మధ్యలో కిటికీ
***
వాన వెలిసింది
కొమ్మల మీద పక్షులు
ఆకాశంలో నక్షత్రాలు వాలాయి
***
రాత్రి వర్షం
తడవని చీకటి
నల్లబడని వాన
***
ఫ్లాట్ ఫారమ్ మీదకు
రైలుకు బదులు
వర్షం వచ్చింది
***
పొద్దున్నే వాన
సూర్యుడి గురించి
ఎవరూ బెంగపడలేదు
***
చాచిన అరిచేతుల్లో
వర్షపు చినుకులు
చెంగు చెంగున ఎగురుతున్నాయి
***
వర్షధారల నడుమ
గాలి
వంకర్లు తిరుగుతోంది
***
గాలివాన
చెట్లన్నీ పాత ఆకులు
దులిపేసుకుంటున్నాయి
***
వాన కురుస్తోంది
వయసు
వెనక్కి నడుస్తోంది
***
వర్షం వచ్చింది, వెళ్ళింది
ఆరిపోవాలంటే
సమయం పడుతుంది
***
వర్షం
ఆకాశం నుంచి సముద్రానికి
సముద్రం నుంచి ఆకాశానికి
***
వర్షం మొదలైంది
పశువులూ పక్షులూ
చప్పుడు చేయకుండా కూర్చున్నాయి
***
జల్లు కురుస్తోంది
అంత పెద్ద సముద్రానికి
ఒళ్ళంతా చక్కిలిగింతలు
*** ***
Advertisements

వాయుశిల్పం

ఆడిటోరియం నిండా పర్చుకున్న
ఉల్లిపొరల పరవళ్ళు శబ్ద స్పర్శల తీవ్ర ప్రకంపనల అల్లాడుతూ
క్షణం నుండి క్షణాలకు పర్చుకుంటున్న
స్వరకీకారణ్యంలోకి తన చిటికెన వేలందించి
లాక్కెడుతున్న పాప గుప్పిట ఉక్కిరిబిక్కిరవుతున్న
నాలుగ్గదుల మౌత్ పీస్ కవాటాల కలకలారావం
ఆడిటోరియం నిండా పర్చుకున్న
ఉల్లిపొరల పరవళ్ళు శబ్ద స్పర్శల తీవ్ర ప్రకంపనల అల్లాడుతూ
క్షణం నుండి క్షణాలకు పర్చుకుంటున్న
స్వరకీకారణ్యంలోకి తన చిటికెన వేలందించి
లాక్కెడుతున్న పాప గుప్పిట ఉక్కిరిబిక్కిరవుతున్న
నాలుగ్గదుల మౌత్ పీస్ కవాటాల కలకలారావం!
వేనవేల నేను వెంటిలేటర్లోంచి జారే
పగటి వెలుగు ప్రవాహంలో కొట్టుమిట్టాడే రేణువుల్లా-
Mood of Beethoven sounds
Interpretation of Beethoven music and rhythm in colours by Adam Guerra. A wonderful description of overall mood of the music in a spantaneous process. The painting was done at the Painting Music project held in 2001.
పెదాల పదనిసల వెంట
ఒంపులు తిరుగుతున్న గాలి
ఒక ముగ్ధమనోహర వాయుశిల్పాన్ని వాటేసుకున్న
తేమ కౌగిలిగిలి-
.
ఇక స్పృశించడానికేం లేదు…. అంతా స్పర్శాలోలత్వమే-
స్వనస్నానమాచరించి
శీతాకాలపు గదిలో చుబుకం కింద
వణికే పిడికిళ్ళేసుకుని ఓ మూల ముడుచుక్కూచోవల్సిందే!
.
కరతాళ ధ్వనుల్ని కబళించిన
అడవి ఎడారైన మౌనం-
కుర్చీ దేహంలోకి
స్వర
ధా
గా ఒలికిపోతున్న నేను
చెక్కిళ్ళపై రాల్చుకున్న నా గతించిన క్లేశాలు
.
ఇంక.. ఈ రాత్రి నేనేం చెయ్యను??
చిత్తడి చిత్తడైన గుండెకాయ మీద వికసించిన మొగ్గతో
వెచ్చలికి ప్యాంటు జేబులో దోపుకున్న చేతుల్లో రోడ్డు వెంట….
ఇంక.. ఈ రాత్రి నన్నెవరో మాటాడించే లోపే నిద్రపుచ్చాలి!
***

అక్షరుడు ఇచ్చిన రెండో పద్యం

గలగలమని నవ్వుతుంటే
ఇన్నేళ్ళుగా నిదురలోకి విచ్చుకోని కలలు
తెరలాగ తెరచిన కళ్ళ మీద మువ్వలుగా, పువ్వులుగా వాలినట్లు-
సవ్వడి ఒక జ్ఞాపకంగా గుండెలో ముడుచుకున్నాక
ఏకాంతం- ఒక శ్రావ్యమైన సంగీతం
మౌనం- కచ్చేరీ ముగించి గోడన వేలాడే వాయులీనం
అర్థరాత్రి ఆకాశాన్ని బోర్లించుకుని
లోయలోకి దొర్లిపోతుంటే ఒంటికి గుచ్చుకున్న నక్షత్రాలను
ఒక్కొటొక్కటిగా పట్టుకుని దాచుకుంటున్నాను-
దోసిట్లో వెలుగులా కరిగే నక్షత్రాలన్నీ ఇప్పుడు ఒకేలా ఉంటున్నాయి
ఒకే పారదర్శక శిల్పంలా మెరుస్తున్నాయి
ఒకే పాద స్పర్శలా గిలిగింతలు పెడుతున్నాయి
ఒక వెచ్చని జ్వరంలా భయపెడుతున్నాయి
మునివేళ్ళ తొలకరిలా తడిపేస్తున్నాయి
దేహ ప్రవాహం మీద సీతాకోక చిలుకల గుంపులా అల్లరి చేస్తున్నాయి
ఇది అక్షర నక్షత్రాల ఆకాశం
నేను పసిబాలుడి నఖక్షతాల గురించి మురిపెంగా మాట్లాడుతున్నాను
నేను పసిబాలుడి నక్షత్ర నేత్రార్ణవంలో తెరచాపలేని పడవలా తుళ్ళిపడుతున్నాను
కాలాన్ని ఇంత గొప్పగా గడిపే వీలున్నప్పుడు
నిర్దయగా
నిర్లాలనగా
గడియారాన్ని భుజాన మోస్తూ ఎక్కడికి మీరంతా?
***
(అక్షర్ నా రెండున్నరేళ్ళ అబ్బాయి. అక్షరుడు ఇచ్చిన మొదటి పద్యం దిగువ పేజీల్లో ఉంది.)
Akshar Pic

లో

మిత్రుడా నీవు దేవుడి హృదయంలో ఉన్నావు
నీ హృదయంలో ఉన్నదే ఈ సకల ప్రపంచం
నిన్ను నీవు అద్దంలో కాకుండా మరెక్కడైనా చూసుకోగలిగావా?
నీలి ఆకాశంలోనో… నీటి అలల్లోనో… నీలోనో… పోనీ మరెవరిలోనో?
నీవు నడుస్తున్న దారికి ద్వారాలు తెరుచుకున్నవి నీ గుండెలోనే
నీ దుఃఖగంగ సుడులు తిరుగుతున్నది ఆ చిట్టి గుండెలోనే
ప్రవాహ జడిలో కొట్టుకుపోతున్నది నీవు కాదు….
నీలోనే ప్రవాహం కొట్టుకుపోతోంది-
ఆనందం మేఘంలా కమ్ముకుందా?
నీవే మేఘమై వర్షిస్తున్నావా?
మిత్రుడా…
నీలోని అడవులు, సెలయేళ్ళు, శిఖరాలు, లోయల మధ్య
నీవు ప్రయాణిస్తూనే ఉన్నావు కదా…..
ఒక పూవును కోసినా గాయం నీకే అవుతుంది-
పూలు నీవి… చెట్లు నీవి…. సకల సమస్తం నీది-
వెళ్తూ ఉండు అలా ధ్యానంలా…
నువ్వు పువ్వై వికసించే క్షణం నీకోసం తప్పకుండా వస్తుంది
అప్పుడు నేను నిశ్శబ్ద సంగీతమై పరిమళిస్తాను…

మళ్ళీ

మళ్ళీ
శుక్లపక్షపు రాత్రి పుష్పం వెదజల్లిన
పుప్పొడి దప్పికలో శిల్పించుకున్న మౌనలిపికి
ఇంకా శబ్దాన్ని ఆపాదించక మునుపే
మనస్తంత్రిపై కల్లోలిత రహస్య ప్రకంపనా తరంగం
పాయలు పాయలుగా విస్తరించుకున్న
అద్వైత రాగ దిగ్బంధనం లోంచి
జ్ఞాపకానికి జీవం పొదిగినట్టు-
నిద్రలోంచి అర్థాంతరంగా వైదొలగిన స్వప్నాన్ని
మెలకువలో వెతుక్కునే అమాయకత్వానికి
లేదా…
నిజంలో అపురూపమై అరూపమైన వైనాన్ని
స్వప్నంలో వెతుక్కునే భావుకత్వానికి చేతనవై
మళ్ళీ నీవు వచ్చావ్-
మంచు బిందువుల వాహకత్వంలోంచి
వేకువకై నిరీక్షించే హరిత పత్రం
ఉదయ సంధ్య నిష్క్రమణంతో పొడిగా అల్లాడినట్టు-
చందమామను గుండె లోతుల దాచి
వెన్నెలై పరచుకున్న కొలను
లోకం నిద్ర లేవడం మూలాన్న
అలలుగా చీల్చుకుపోయినట్టు
నీవు వచ్చి వెళ్ళే క్షణపు నిరంతరత్వం మీద
పిడికెడు ద్రాక్ష పండు ఒరుసుకుపోతూ ఉంటుంది-
చూపుల్ని చుంబించే అద్వితీయ దృశ్య గాఢతవై
తీగల కొమ్మల మీంచి సంగీత విహంగానివై
వెళ్ళిపోవడానికే కదా……
నీవు మళ్ళీ మళ్ళీ మళ్ళీ……

మళ్ళీ మళ్ళీ

ఆమె మళ్ళీ గుర్తుకు వచ్చింది
తన వీధి గుమ్మానికి వేలాడే నా కళ్ళు
రెండు పూలు పూశాయట…
కోసుకుని కొంగుముడితో వచ్చింది

అంధుణ్ణి నేను
కలల్ని కనడమే కాని
చూడలేను-

గాలి మెలితిరిగేలా ఆమె గలగలా నవ్వింది
నాకు వూపిరి తోచలేదు
రెండు క్షణాలు నా కళ్ళల్లో తడిసి
బరువుగా జారిపోయాయి…
వాటిని తీసుకుని ఆమె మళ్ళీ వెళ్ళిపోయింది

రెండో ముద్దు కోసం

చందమామను
తలగడ కింద దాచిపెట్టి
ప్రేమగా నిద్రపోవాలి
తెల్లారగట్ట లేచి
పుస్తకం మధ్య నలిగిన ఆకులా
వూపిరాడక అల్లాడిన చందమామను
తిరిగి ఆకాశం కేన్వాసు మీద
అతికించేయాలి-
మళ్ళీ రాత్రికి
అది కొత్త వెన్నెలను ప్రోది చేసుకుని
నను కొల్లగొట్టుకోమంటూ
కచ్చితంగా వచ్చి వాలుతుంది!