అనేకవచనం, Uncategorized

గాలొక్కత్తే…!


గాలొక్కత్తే…!
గాలొక్కత్తే… గాలొక్కత్తే… తన వెంట లోలకాల్ని లాక్కుపోతూ
లోకలోకాల కలల్ని పారదర్శకంగా లీనం చేసుకుంటూ
చిదిమిన దీపం శిరస్సు మీది
చీకటిని తాగి తాగి
గాలొక్కత్తే… గాలొక్కత్తే…
వాయులీనాలనకీ వన కుహూరాలకీ
తనువు తననానమాడించి
నన్నల్లుకుని శబ్దమూ కాని మౌనమూ కాని
ఏకాంతంలోకి తోడుగా వచ్చేది
గాలొక్కత్తే-
ఏకాంత వనమూ ఐ, వనమాలీ ఐ…
పొద్దుటి మంచు కింది నల్లటి కొండ మీంచి
నను భద్రంగా నగ్నంగా తనలోంచి జ్ఞాతంగా…
.
గాలొక్కత్తే…!
గాలొక్కత్తే… గాలొక్కత్తే… తన వెంట లోలకాల్ని లాక్కుపోతూ
లోకలోకాల కలల్ని పారదర్శకంగా లీనం చేసుకుంటూ
చిదిమిన దీపం శిరస్సు మీది
చీకటిని తాగి తాగి
గాలొక్కత్తే… గాలొక్కత్తే…
.
Lent Wind - the pencil sketch
.
వాయులీనాలనకీ వన కుహూరాలకీ
తనువు తననానమాడించి
నన్నల్లుకుని శబ్దమూ కాని మౌనమూ కాని
ఏకాంతంలోకి తోడుగా వచ్చేది
గాలొక్కత్తే-
.
ఏకాంత వనమూ ఐ, వనమాలీ ఐ…
పొద్దుటి మంచు కింది నల్లటి కొండ మీంచి
నను భద్రంగా నగ్నంగా తనలోంచి జ్ఞాతంగా…

***

3 thoughts on “గాలొక్కత్తే…!”

  1. మీకు నా విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

    1. ధరణీరాయ్ చౌదరి గారికి.. ధన్యవాదాలు.
      మీకు కూడా మనస్ఫూర్తిగా దసరా శుభాకాంక్షలు.

  2. శ్రీధర్ గారు, భలే, మనం ఇద్దరం ఒకే కవిసమయాన్ని భిన్న వ్యక్తీకరణలు. మీరు ఇది చూసి తీరాల్సిందే… ప్రాణ వాయువుగ పాటనే నింపేస్తా! http://maruvam.blogspot.com/2009/04/blog-post_08.html

    నేను
    “వేణువూది నిను రాగాల అలంకరించాలి.
    పాటవై, ప్రకృతి అందెల రవళైపోతానంటావా?
    అలాగే కానీ, పరవశించిపోతా, ప్రాణ వాయువుగ పాటనే నింపేస్తా.”

    అని ముగించాను…

Leave a comment