అనేకవచనం, Uncategorized

ప్రేలాపన


ఏ గొల్లభామో దొంగిలించిన వెన్నముద్ద కోసం
మతిలేని గోపయ్య
పిల్లనగ్రోవిలో కన్నీళ్ళు వొలకబోసుకుంటాడు
రాధమ్మ వెనీలా ముద్దల్ని
చెక్క చెంచాతో చప్పరిస్తూ ఉంటుంది-
శంఖం పూరించిన గోవర్థనుడు
పెదాల ఒత్తిడిలోంచి మెడవంపుల వీచిన గాలి
…. నాదమో? అనునాదమో!?
.
ఇప్పుడు సత్యభామ కాలిబొటన వేలి గోరు చిట్లే ఉంటుంది
మంచం కోడుకు తగులుకుని!
రుక్మిణి చిటికెన వేలు ఒంటరై కంపిస్తూ ఉంటుంది
పదహారువేల జతల చురకత్తులు గుచ్చుకుని
జల్లెడైన నీలాకాశం కుండపోతగా వర్షిస్తుంది-
పక్కింటి పడగ్గది ప్రైవసీలో పొడిచిన సూర్యుడు
వేడివాన…. ఉక్కపోత!
రామ రామా… నాకు మరో జన్మ లేదురా తండ్రీ!
నా ఒంటరి రామచిలుక
ముక్కు గిల్లుకుంటూ కిలకిలమంటూ
ఏ కొమ్మ మీదో నిలవని కాళ్ళ దిటవుతో
తడబడుతూ ఉంటుంది….
జామ చెట్టు కళ్ళన్నీ కాయలు కాసినై-
***

3 thoughts on “ప్రేలాపన”

  1. Nice expression Sreedhar!

    మెడవంపుల వీచిన గాలి
    …. నాదమో? అనునాదమో!?..

    No words to comment.పెయింటింగ్ మీరు వేసిందేనా, శ్రీధర్ ? వండ్రఫుల్. అభినందనలతో…నూతక్కి

Leave a comment