లేదు


.
సమాధిలో
కన్నీటి చుక్కలు
చిగురు తొడుగుతున్న చప్పుడు
.
నల్లమబ్బుల్లో
సెగలు కక్కుతున్న
ఆత్మల ధూమపు రొద
.
వీధి గాలి తంత్రులపై
మొదలు తెగిన ఆలోచనల
నాద విషాదం-
.
రెల్లు గడ్డి దోసిళ్ళలో
జారిపడిన
రెక్కలు తెగిన చూపులు-
.
రెప్పల్ని కప్పుకున్న కళ్ళను
తెరిచేందుకు కలల నిష్ఫలయత్నం-
.
చివరి పాద ముద్రల
అసంపూర్ణ స్వర విరహం
అహరహం అనంతగీతం
ఎదురు చూపుల
వెదురు పాముల్లో-.

***

Advertisements

4 thoughts on “లేదు

 1. డియర్ శ్రీ,

  ఇది నీ కవితలా లేదు. కవితకి మూలమైన, లేదా, ప్రేరణైన అనుభవాన్ని తగ్గించలేను గాని, అది దీనిలోకి సరిగా permeate కాలేదేమో. అందుకేనేమో, కవితలో నీ- తనం లే….దు!
  So, I don’t want to look into nuances of the poem… 🙂

  urs,
  naresh

  • నరేశ్,
   నా నుంచి నా”తనం” లేని కవిత? వేధించే అపరిచితుడి ఆనవాళ్ళను వెతుక్కునే అనేకవచనాల్లో ఎక్కడో తప్పిపోయానా? పొయెం టైప్ చేస్తూ మధ్య మధ్య హిట్ చేసిన ప్రతి స్పేస్ లో.. permeate అవలేనితనం… ఈ కవితలో నువ్వన్నట్లు చాలా ఖాళీలున్నాయి? ఎవరు పూరిస్తారు? చాలా రోజులే ప్రయత్నించాను కవితను పెంచడం, పోషించడమేమిటని నాపై నేనే విసుక్కుంటూనే.. అలాగని.. ఎలా వదిలేయడం? క్షణాలు వ్యాకోచించిన క్షరాల్లో నేనున్నానని తెలిసి తెలిసీ?
   – శ్రీ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s