మా ఇంట్లో అంతరిక్షం!

.
మా ఇంట్లో ఈ మధ్యే అంతరిక్షాన్ని ఆవిష్కరించాం
అక్షరమక్షరం తడిమి తడిమి తెలుసుకుంటున్నాం
మా చూపుడు వేళ్ళ మీద నక్షత్రాలు వెలుగుతున్నాయి
మా కను రెప్పల వెంట్రుకలకు నెలవంకలు వేలాడుతున్నాయి
నేనూ మా ఆవిడా కలసి కొత్త ఖగోళాన్ని పోటీ పడి ఒళ్ళోకి తీసుకుంటున్నాం
మేమంతా ఉపగ్రహాలమై కొత్త చందమామ చుట్టూ పరిభ్రమిస్తున్నాం
ప్రతి క్షణం ఉదయిస్తున్నాం… చీకటిని వెలిగిస్తున్నాం…
కొత్త రుతువులమై పరిమళిస్తున్నాం..
.
…………………..
…………………………….
Advertisements