About

అనేకవచనం పేరుతో దాదాపు దశాబ్దం కింద వెలువరించిన నా మొదటి కవితా సంపుటిలోని కవితలను వెబ్ తరంతో పంచుకోవాలని ఈ ప్రయత్నం. ఈ బ్లాగులో అనేకవచనం లోని కవితలే కాకుండా కొత్త కవితలు కూడా ఉన్నాయి. త్వరలో ఈ బ్లాగును వర్గీకరించి.. అనేకవచనం, కొత్త కవితలతో పాటు నా వ్యాసాలు, పుస్తక సమీక్షలు, నాకు నచ్చిన కవితల విశ్లేషణలు కూడా అందిస్తాను. ఈ కవితలను చదివి మీ స్పందనను నాతో పంచుకుంటే అదొక పునరుత్తేజం.
మీ
పసునూరు శ్రీధర్ బాబు
వృత్తి: జర్నలిజం
జీవితం: కవిత్వం

Advertisements

6 thoughts on “About

 1. ఇనానిమేట్‍ ఆబ్జెక్ట్ లో బతుకు పోరుని చూసే మీ కవిత్వం, ప్రాకృతిక శక్తుల ఖేలకు మన దైనందిన జీవితానికి అభేదం పాటించే మీ కవిత్వం ఎప్పట్లాగే గొప్ప ఆనందమిచ్చింది. ‘అనేక వచనం’ తో పుట్టిన అభిమానం ఇప్పుడు మరింత పెరిగింది. ముఖ్యంగా ‘జింగిల్స్’, ‘డెజా వూ’ వంటి పద్యాలు పాఠకుడిని మీ వాతావరణంలోనికి తీసకెళ్లి కాసేపు తనకు తాను గుర్తు రాకుండా చేస్తాయి. సూర్యున్ని తుమ్మచెట్టు కొమ్మల్లో నారింజ పండుగా చూడడమే వావ్ అనిపిస్తే, అంతలోనే అతడినొ క గాలి పటం చేసి, మళ్లీ గాలి పటం గాలికి ఎగిరిపోతుందనడం అద్భుతంగా వుంది. మనస్సును పరిగెత్తించింది. పొద్దెక్కితే సూర్యడుంటాడు గాని, తుమ్మ కొమ్మల్లో నారింజ పండు వుండదనే సద్యోస్ఫురణ, ఆ వెంటనే నన్ను ఇంకేవేవో వూహల్లోనికి తీసుకెళ్లింది.
  ఇలా మీ కవిత్వాన్ని… పాత కొత్త పద్యాల్ని ఒక చోట చదువుకోడానికి వీలుగా వుంచడం చాల బాగుంది.
  కంగ్రాజ్యులేషన్స్ …….హెచ్చార్కె

 2. kavithvame jivitham anukune mitho kalisi pani chesthunadhuku santhoshamga undhi.Mee rachanlu awesome………….

 3. శ్రీధర బాబు గారూ మిమ్మల్ని(మీ సాహిత్యాన్ని) అనేక నెలలుగా చదువుతున్నా మీ గురించి(అబౌట్) చాలా లేటుగా చదివాను. యీ వేళె మీరు మాకు చాల దగ్గరి వారని (వాస్తవదూరంలో ),శ్రీ చల్లా రామ ఫణి గారి ద్వారా ఒక సమ్మేళనంలో తెలుసుకొన్నాను. నాకు చాల ఆశ్చర్యమేసింది . ఒకే ఒక్కడుగా ఎడారిలో , నిర్మానుష్య ప్రాంతంలో ఒంటరిగా కుటీరం నిర్మించుకొన్న నా చుట్టూరా యినాడు ఏర్పడిన జనసంద్రంలో నే మీ వంటి సాహితీవేత్తలు నివసిస్తున్నారని తెలిసి చాల ఆనందం కలిగింది. అవకాశముంటే ఒక సారి కలుద్దాం. …శ్రేయోభిలాషి …నూతక్కి .

  • డియర్ నూతక్కి గారూ..
   మీ అపరిచిత పరిచయం ఆత్మీయ స్నేహంగా మారి చాన్నాళ్ళయింది. మీ అభిమానానికి ధన్యవాదాలు. మనం తప్పుకుండా కలుసుకుందాం. మీరు ఎక్కడ వుంటున్నారు? ఏం చేస్తున్నారు? మీ బ్లాగును కూడా నేను చూస్తూనే ఉన్నాను. నేను హైదరాబాద్ లోని హెచ్.ఎం.టివిలో జర్నలిస్టుగా ఉన్నాను. నా ఫోన్ నెంబరు… 9553586101.

   Warm Regards

   SREEDHAR BABU

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s